![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -133 లో..... చందుకి పెళ్లి ఇష్టం లేదు అందుకే వెళ్లిపోతున్నానని విశ్వ క్రియేట్ చేసి చందుని కిడ్నాప్ చేస్తాడు. ఇక రామరాజు తన పెద్ద కొడుకు కూడా వాళ్ళలాగే నన్ను మోసం చేసాడు. నా పరువు తీసాడని ఏడుస్తాడు. నేనంటే ఇష్టం లేక ఆయన పారిపోయాడా అని శ్రీవల్లి ఏడుస్తుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లొచ్చిన అబ్బాయికి పిల్లని ఎవరిస్తారు మేమ్ కాబట్టి ఒప్పుకున్నాం కానీ మీ అబ్బాయి ఇలా చేసాడని భాగ్యం అంటుంది.
ఊళ్ళో అందరూ మనిషికో మాట అంటుంటారు. రామరాజు లాగా తన కొడుకులు అంటూ వెళ్ళిపోతారు. అన్నయ్య ఇలాంటి పని ఎప్పుడు చెయ్యడు. ఇందులో ఏదో మోసం ఉంది. నేను అన్నయ్యని ముహూర్తం లోపు తీసుకొని వస్తానని ప్రేమని తీసుకొని బయటకు వస్తాడు ధీరజ్. ఇదంతా మీ వాళ్ళు కావాలనే చేశారని ధీరజ్ అంటుంటే మా వాళ్లని అనకు అని ప్రేమ అంటుంది. మేకప్ ఆర్టిస్ట్ తో మా అన్నయ్య మాట్లాడడం చూసానని ప్రేమ చెప్తుంది. అప్పుడే మేకప్ ఆర్టిస్ట్ ప్రేమ, ధీరజ్ ల కంటపడుతుంది.
తనని బెదిరించగా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తానని ఒక రూమ్ కి తీసుకొని వెళ్లి.. ప్రేమ, ధీరజ్ ఇద్దరిని లోపల ఉంచి బయటనుండి తాళం వేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమ, దీరజ్ ఎలాగైనా చందు ఎక్కడున్నాడో కనిపెట్టి ముహూర్తం టైమ్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటారు. చందు బావని కనిపెట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందంటూ భద్రవతికి కాల్ చేసి మాట్లాడుతుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |